ముంచంగిపుట్టు మండలంలోని చిన్నసరియపల్లి తదితర గ్రామాలకు వెళ్లే రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం నిర్మించిన రహదారి శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారయిందన్నారు. దీనితో రాకపోకల సమయంలో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని వాహనచోదకులు బుధవారం కోరారు.