పెదబయలు మండలంలోని కిముడుపల్లి పంచాయతీలోని గడుగుపల్లిలో సర్పంచ్ శోభరాణి ఆధ్వర్యంలో మంగళవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మండల పశువైద్యాధికారి డాక్టర్ సౌజన్యదేవి పాల్గొని 137 గొర్రెలు 56 పశువులు 27 మేకలకు నట్టల నివారణపై తనిఖీ చేసి టీకాలను వేశారు. ఆమె మాట్లాడుతూ.. మూగజీవాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం పశువైద్య శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.