రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

84చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దివీస్ లో ఉద్యోగం చేస్తున్న శేశెట్టి రాంబాబు మంగళవారం ఉదయం భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్ వద్ద ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా లారీ వచ్చింది. దాన్ని తప్పించేందుకు వెనక్కి తగ్గే సమయంలో ట్రాక్టర్ వెనుక భాగం బలంగా తగిలి రోడ్డు పై పడి అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్