భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండల కార్యాలయంలో గురువారం పిఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 40 గిగా బైట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం రూ. 60 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. సౌర విద్యుత్తు వల్ల ప్రకృతికి నష్టం వాటిళ్లదని, విద్యుత్తు బిల్లులు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.