విశాఖలో రుషికొండ మీద గత వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 500- 600 వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఒక ప్యాలెస్‌ని ఏం చేయాలా అని టీడీపీ కూటమి ప్రభుత్వం తలలు బద్ధలు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విలాసవంతమైన ప్యాలెస్‌ని షూటింగ్‌లకు అద్దెకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. ఈ విధంగా ప్యాలెస్‌ని సినీ నిర్మాతలు, దర్శకులకు ఇస్తే తమకు అనుకూలంగా షూటింగ్‌లు చేస్తారని, ఫలితంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.