ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ. 245 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లోని 1, 268 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన బుధవారం జరిగిన 1, 7 స్థాయీ సంఘ సమావేశాల్లో పలు ఇంజనీరింగ్ విభాగాల ప్రగతిని సమీక్షించారు. పంచాయతీరాజ్ రోడ్లపై చర్చకు ఎస్‌ఈ బదులిస్తూ రహదారులను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు