చోడవరం: బాల కార్మికుల నిర్మూలనపై దుకాణాల తనిఖీ
పాన్ఇండియా బాల కార్మికుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం చోడవరం సహాయ కార్మిక శాఖ అధికారి పి సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్మిక శాఖ, పోలీస్, ఐసిడిఎస్, సీడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చోడవరంలో గల దుకాణాలు షాపింగ్ మాల్స్, హోటల్స్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో స్వీట్స్, ఫ్యాన్సీ గిఫ్ట్ ఆర్టికల్స్, పద్మ కలెక్షన్ రెడీమేడ్ షాపులో పనిచేస్తున్న వారికి తక్కువ జీతాలు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.