అపరిష్కృతంగా ఉన్న రైతాంగం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏ. పి. రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు సోమవారం చోడవరం, అంకుపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో సచివాలయాల కార్యదర్శులకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతాంగం పై సవతి తల్లి ప్రేమ చాలించి, తక్షణమే అపరిష్కృతమైన రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.