బుచ్చెయ్యపేట మండల కేంద్రంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారన్న సంఘటనపై గురువారం మాజి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆదేశాలు మేరకు స్థానిక జడ్పీటీసీ దొండా రాంబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొల్లిమళ్ల అచ్చిన్నాయుడు, మాజి డీసీసీబీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.