ఈ నెల 27నుండి 29వరకు కలకత్తా విసుధన్ విద్యాలయంలోజరిగిన 5వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో పోటిలలో చోడవరంలో శిక్షణ పొందిన ఆరిలోవ విద్యార్థులు కొల్లిపార తన్విత్ ఉదయ్ సబ్ జూనియర్ ఇండివిజల్ ఫూమ్ సే లో బంగారం పతకం, క్యోరుగి అండర్ 32 డివిజన్లో రజత పతకం, కెడేట్ ఇండివిజల్ ఫూమ్ సే, కెడేట్ డివిజన్ 152 సె. మీ రజత , కాంస్య పతకాలు సాధించినట్టు ఉమ్మడి జిల్లా తైక్వాండో ఉపాధ్యక్షుడు పల్లం మురళీకృష్ణ మంగళవారం తెలిపారు.