రాష్ట్రంలో వర్తక వాణిజ్య సంస్థలోనూ, దుకాణాల్లోనూ పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఈ సంవత్సరం సెలవు దినాలు ప్రకటించినట్లు చోడవరం సహాయ కార్మిక శాఖ అధికారి పి సూర్యనారాయణ మంగళవారం తెలిపారు. వాటిలో భాగంగా ఈనెల 15, 26, ఫిబ్రవరి 26, మార్చి 31, మే ఒకటి, ఆగస్టు 15, అక్టోబర్ 2, నవంబర్ 1, డిసెంబర్ 26 తేదీల్లో కార్మికులకి సెలవు దినాలుగా ప్రకటించినట్లు వివరించారు. కాబట్టి యజమానులు గమనించాలన్నారు.