విశాఖలో ఓ వివాహితపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ బి కాలనీ, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో ఓ వివాహిత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడు పగ పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆమెకి ఫోన్ చేసి రప్పించాడు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో అతడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.