విశాఖలోని ఆరిలోవ 11 వ వార్డు తోటగరువు బీఎన్ఆర్ కొండ పైన ఒక అనాథ మహిళ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. స్థానికులు మాణిక్య రావు , కొండమ్మ తదితరులు ఉపకార్ ట్రస్ట్ నిఆశ్రయించగా ఆ అంత్యక్రియలకు కావల్సిన డబ్బులను ట్రస్ట్ అధ్యక్షుడు అచ్యుత రావు అందజేశారు. ఈసందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ పేదలు ఆపదలో ఉంటే తనను సంప్రదించాలని, చేతనైన సాయం చేస్తానన్నారు.