విశాఖ: గర్భిణీలు, చిన్నారుల‌కు పౌష్టికాహారం అందించాలి

67చూసినవారు
విశాఖ: గర్భిణీలు, చిన్నారుల‌కు పౌష్టికాహారం అందించాలి
గ‌ర్భిణుల‌కు, చిన్నారుల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా పౌష్టికాహారం అందించాల‌ని ఐసీడీఎస్ అధికారుల‌ను, సిబ్బందిని విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. స్థానిక రేస‌పువానిపాలెంలోని అంగ‌న్వాడీ కేంద్రాన్ని మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. చిన్నారుల హాజ‌రు శాతాన్ని, స‌రకుల నిల్వ‌ల‌ను ప‌రిశీలించారు. పిల్ల‌ల నేమ్ రిజిస్ట‌ర్ల‌ను త‌నిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్