AP: ఏడు కొండలు వేంకటేశ్వర స్వామి సొంతమని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘రోజూ ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు.’ అని అన్నారు.