TG: భూములను అమ్మడం, తాకట్టు పెట్టడం ద్వారా రూ.50వేల కోట్లు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని అసెంబ్లీలో హరీశ్ రావు అన్నారు. అనుముల వారి పాలనలో ఎన్ని ఎకరాలు అమ్ముతారో చెప్పాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోందని, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైజింగ్ అని సీఎం నినాదం ఇచ్చారని, ఎక్కడ ఉందన్నారు.