రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాకేంద్రంలో థర్మల్ బూడిదతో నిండిన నాలుగు ట్యాంకర్లు వరుసగా ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.