బంగారం, వెండి ధరలు కాస్త తగ్గి సామాన్యుడికి ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 తగ్గి రూ.82,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.440 తగ్గడంతో రూ.90,200కు చేరింది. కేజీ వెండి ధరపై ఏకంగా రూ.2,100 తగ్గడంతో రూ.1,12,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.