స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమంటూ ప్రధానమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని స్టీల్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. సోమవారం గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెం రిలే దీక్ష శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ వస్తున్న ప్రధానమంత్రి స్టీల్ ప్లాంట్ విషయంలో శుభవార్త చెప్పాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.