వైభవంగా కొండయ్యవలస మరిడిమాంబ నెల పండుగ మహోత్సవం..

974చూసినవారు
వైభవంగా కొండయ్యవలస మరిడిమాంబ నెల పండుగ మహోత్సవం..
జీవీఎంసీ 85 వార్డ్ కొండయ్య వలస గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి నెల పండుగ ఉత్సవమును గ్రామ పెద్దలు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి దిశా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి లక్ష్మి మరియు ఆమె భర్త టి శ్రీనివాసరెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయ ప్రాంగణములో టి లక్ష్మి దంపతుల చేతుల మీదుగా పేద వారికి, జీవీఎంసీ శానిటరీ సిబ్బంది కి బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు వారి వారి ఉద్యోగ, వ్యాపారల వలన కలుగు ఒత్తిళ్లతో క్షణికావేశాలకు లోనై ఎన్నో చెయ్యరాని తప్పులు చేస్తున్నారని, కావున ప్రతి ఒక్కరూ కొంత సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గడపడం వలన మనశ్శాంతి మరియు ఆత్మ సంతృప్తి కలుగునని, తద్వారా వారి వారి జీవితములలో సత్ఫలితాలు పొందుతారని అన్నారు.

అనంతరం మాట్లాడుతూ ఆడవారికి ఎటువంటి అన్యాయం జరిగిన, ఆడవారిని అగౌరవ పరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన దిశా చట్టం వారికి శ్రీరామరక్షగా ఉంటుందని, కావున మహిళలు ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోని ఆత్మ ధైర్యంతో ముందుకు సాగి అన్ని రంగాలలో విజయం సాధించాలని అన్నారు. మరియు ఇంత చక్కని కార్యక్రమంలో తనని భాగస్వామిని చేసినందుకు గ్రామ పెద్దలకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


అనంతరం ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. మరిడిమాంబ ఆలయ కమిటీ, రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మికంగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ తద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అలాగే ఇటీవల జరిగిన మరిడిమాంబ ఆలయ వార్షికోత్సవం, మరిడి మాంబ జాతర మహోత్సవాలు మరియు శ్రీ రామ నవమి కళ్యాణ మహోత్సవాలను గ్రామ ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకుని అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించి చుట్టుపక్క గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని మరిడిమాంబ ఆలయ కమిటీ సభ్యులను మరియు శ్రీరామ సేవకుల్ని అయన ప్రత్యేకంగా అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్