ప్రజల ఆశలు,ఆకాంక్షలకు తగ్గట్టు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను మాజీ కార్పొరేటర్ 66 వార్డ్ టిడిపి ఇంచార్జ్ మహమ్మద్ రఫీ శనివారం కోరారు. 66వ వార్డు ఇంద్ర కాలనీలో జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.