లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్న బాబు

65చూసినవారు
లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్న బాబు
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు మండిపడ్డారు. శనివారం మాడుగుల వచ్చిన ఆయన విలేకరితో మాట్లాడుతూ వందరోజుల పాలనలో ఏమి సాధించలేని కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టి మల్లించేందుకే లడ్డు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్