దేవరాపల్లి: సీపీఎం ఆధ్వర్యంలో విద్యుత్ నమూనా బిల్లు దగ్ధం

67చూసినవారు
పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దేవరాపల్లి మండల కేంద్రంలో నాలుగు రోడ్లు కూడలి వద్ద ఆదివారం భారీ విద్యుత్ నమూనా బిల్లుతో నిరసన చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ, స్మార్ట్ మీటర్ల బిగింపు వ్యతిరేకించాలంటూ సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల పార్టీ కార్యదర్శి బీటీ. దొర నినాదాలు చేశారు. విద్యుత్ నమూనా బిల్లును దగ్ధం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్