అనకాపల్లి జిల్లా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా నియమింప బడ్డా మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడుకి శనివారం పార్టీ శ్రేణులు ఘన సత్కారం చేశారు. జిల్లా అధ్యక్ష హోదాలో ఆయన రావడంతో మాడుగుల వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఎవరూ ఆదైర్య పడవద్దని మంచి రోజులుముందున్నాయని, పార్టీ కోసం పని చేయాలని కోరారు.