మాడుగుల మండలం కె. జె. పురం గ్రామంలో జరుగుతున్న 21వ పశు గణన కార్యక్రమాన్ని పాడేరు డివిజన్ ఉప సంచాలకులు డా. సి. హెచ్. నరసింహులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఫిబ్రవరి 28వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ పశు గణన జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు మండలంలో ఉన్న 11మంది ఎన్యుమరేటర్లు 4905 ఇళ్లను సర్వే చేశారన్నారు. కాబట్టి పశువులుఉన్న ప్రతి ఒక్కరు సర్వే పాల్గొనాలన్నారు.