మాడుగుల కో ఆప్షన్ మెంబర్ గ్రాంట్ 8 లక్షలు రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపడతున్నట్టు కో ఆప్షన్ మెంబర్ షేక్ ఉన్నిష శుక్రవారం తెలిపారు. వాటిలో భాగంగా 6. 50 లక్షల రూపాయలతో షాది ఖాన అభివృద్ధి , 150, 000 రూపాయలతో 2వ ఎంపీటీసీ పరిధిలో గల 7, 8 వార్డులో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద ఉన్న దేవతా వృక్షం రావి, వేప చెట్టు చుట్టూ టైల్స్, స్టీల్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.