బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా రెండు రోజుల నుంచి నక్కపల్లి మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిరు జల్లుల వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. మండలంలో 44. 4మి. మీ వర్షపాతం నమో దైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నక్కపల్లి మండలంలో తీర గ్రామాల పరిస్థితిపై తహసీల్దార్ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.