విశాఖ డెయిరీ యజమాన్యంపై ధ్వజమెత్తిన స్పీకర్

57చూసినవారు
విశాఖ డైరీ యాజమాన్యం చేస్తున్న అక్రమాలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. సోమవారం మాకవరపాలెం మండలం లచ్చన్న పాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడి పాలను హైదరాబాద్ తీసుకువెళ్లి రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. రెండేళ్లుగా రైతులకు బోనస్ ఇవ్వడం లేదన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో డెయిరీపై చర్చిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్