గొలుగొండ మండలం రావణాపల్లిలో తహశీల్దార్ పీ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. రైతులు తమ భూసమస్యలపై అర్జీలను అందజేశారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ భూసమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లు సత్తిబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.