తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతాయని నాతవరం తహశీల్దార్ వేణుగోపాల్ సోమవారం తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన వారు గ్యాస్ బుకింగ్ ఆన్ లైన్ ద్వారా చేసుకుంటున్నారన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సిలిండర్ డెలివరీ అయిన వారం రోజుల్లోనే లబ్దిదారుల ఖాతాలకు సిలిండర్ కు సంబంధించిన నగదు జమా అవుతుందన్నారు. ఏమైనా ఇబ్బందులు సూచనల కోసం 1967 నెంబరుకు సంప్రదించాలన్నారు.