వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని నాతవరం ఎస్సై సీహెచ్. భీమరాజు హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రమైన నాతవరంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్పై మాట్లాడుతూ రికార్డులు లేకుండా వాహనాలు నడిపే వారి పైన కేసులు నమోదు చేసి అపరాధ రుసుము విధిస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. వాహనదారులు ఖచ్చితంగా లైసెన్స్, రికార్డులు కలిగి ఉండాలన్నారు.