భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం నర్సీపట్నంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ నాయకులు అడిగర్ల రాజు, రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లేకపోవడం వల్ల అనేకమంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఇసుక సరఫరా చేయాలని పేర్కొన్నారు.