బలిఘట్టంలో విజయోత్సవ సంబరాలు

81చూసినవారు
నర్సీపట్నం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడు భారీ మెజార్టీతో గెలుపొందటంతో బలిఘట్టం గ్రామంలో టీడీపీ నాయకులు ఆదివారం సంబరాలు జరుపుకున్నారు. పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని నాయకులు, మహిళలు, యువకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్థులందరికీ భోజనం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్