ఐదు రోజుల పాటు ఆన్లైన్ పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం వెల్లడించింది. ఆన్లైన్ పోర్టల్ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని, అలాగే ఇప్పటికే చేసుకున్న బుకింగ్లు రీషెడ్యూల్ అవుతాయని స్పష్టం చేసింది.