డిజిటల్ ఇండియాలో భాగంగా వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో గల అన్నిస్టేషన్ లలో ఆన్ లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించాలని రైల్వే అధికారులు బుధవారం విజ్ఞప్తి చేశారు. పాసింజర్ రిజర్వేషన్ సిస్టం, అన్ రిజర్వ్ టికెటింగ్ సిస్టంకు సంబంధించి క్యూఆర్ కోడ్ టికెటింగ్ ను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అవాంతరాలు లేని డిజిటల్ లావాదేవీలు కోసం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.