అల్లూరి జిల్లాలో గిరిజనులకు తప్పని డోలి మోతలు

55చూసినవారు
గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. పాడేరు మండలం డి. సంపాల కు చెందిన వంతల మిట్టన్నకు జ్వరం రావడంతో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి 3 కిలోమీటర్ల దూరం డోలిలో బుధవారం మోసుకు వెళ్లారు. కొత్తవలస నుండి డి. సంపాల  వరకు అంబులెన్స్ రావటానికి రహదారి సదుపాయం లేకపోవడంతో ఇలా డోలిమోతన తీసుకువెళ్లినట్లు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్