హుకుంపేట మండలంలోని మత్స్యపురం పంచాయతీ పరిధి మత్స్యపురంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంకులో వరద నీరు చేరడంతో వీధుల కొళాయిల్లో బురద నీరు వస్తుండడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ఉప సర్పంచ్ చందనపాత్రుడు తదితరులు కోరారు.