పాడేరు: గోతుల్లో పడిన పశువులు: గోతులు పూడ్చాలంటూ ప్రజల ఆందోళన

63చూసినవారు
కొయ్యూరు మండలం లుబ్బర్తి జంక్షన్ వద్ద సెల్ టవర్ కేబుల్ వైర్ల కోసం తీసిన గోతుల్లో రెండు మూగ జీవాలు శుక్రవారం ప్రమాదవశాత్తూ పడిపోయాయి. దీంతో వాటిని బయటకు తీయడం కష్టమైంది. ఈ గోతులు తీసి రెండు, మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూడ్చకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. వీటిని త్వరగా పూడ్చకపోతే పశువులకు జరిగినట్లే, చిన్న పిల్లలు పడిపోతే పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్