దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో దుర్గమ్మ వారికి సారెను సమర్పించేందుకు స్థానికులు పిండి వంటకాలను సిద్ధం చేశారు. తయారుచేసిన సారెను గ్రామంలో తప్పిటి గుళ్ళు వాయిస్తూ వైభవంగా ఊరేగించారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.