స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లిలో రాష్ట్రస్థాయిలో జరిగిన అండర్-14 బాల బాలికల హాకీ పోటీల్లో విశాఖ జిల్లా బాలుర జట్టు విజయకేతం ఎగరవేసింది. బాలికల విభాగంలో కడప జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు ఆదివారం స్థానిక సర్పంచ్ జయ రత్నకుమారి, వైసీపీ నేత రామకృష్ణ, టీడీపీ నాయకుడు వెంకటేశ్ బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ శివదత్ పాల్గొన్నారు.