ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి. ఎన్. వి. ఎస్ ప్రసాద్ కు భారత్ శ్రీ అవార్డు లభించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఇండియా కాన్ఫరెన్స్ హాల్ లో హర్యానాకు చెందిన హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ అందజేసింది. అవార్డు అందుకున్న డాక్టర్ ప్రసాద్ బుధవారం ఎస్ రాయవరంలో పలువురు అభినందించారు.