అభివృద్ధి సంక్షేమం ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సోమవారం పరవాడ మండలం పెదముషిడివాడలో నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం'కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు