పవన్ కళ్యాణ్ మానవతావాది

84చూసినవారు
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవతావాది అని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండలం వేపగుంటలో నిర్వహించిన ప్రాయశ్చిత్త దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక మతానికి కులానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. ఆయన ఏం చేసినా లోక కళ్యాణ కోసం చేస్తారని ప్రజలు నమ్మినట్లు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకు ఒక నమ్మకం అన్నారు.

సంబంధిత పోస్ట్