పార్టీలకతీతంగా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ఆదేశించారు. సోమవారం నియోజకవర్గ పరిధిలో కేఎన్ పాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆక్రమణలను తొలగించి హక్కుదారులకు న్యాయం చేయాలన్నారు. భూ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రెవెన్యూ సంస్థలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారని తెలిపారు.