నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకొని తనను కలవడానికి వచ్చే కూటమి శ్రేణులు అధికారులు అభిమానులు దండలు బొకేలు తీసుకురావద్దని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పెందుర్తి మండలం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ వాటికి బదులుగా విద్యార్థులకు అవసరమయ్యే నోట్ పుస్తకాలు పెన్నులు తీసుకురావాలని కోరారు.