విశాఖ: హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలం

85చూసినవారు
విశాఖ: హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలం
హామీలు అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని శాసనమండలి ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తో కలిసి శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన తరువాత కూడా ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు.

సంబంధిత పోస్ట్