విశాఖ దక్షిణ నియోజకవర్గం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వ్యవస్థాపకులు ఎంవీఎల్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా న్యాయమూర్తి తనిజా రెడ్డి, ఆహార భద్రత విభాగం నందజి, లీగల్ మెట్రోలజీ విభాగం రామారావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వినియోగదారులకు చైతన్యం అవసరమన్నారు.