విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కొత్త రోడ్డు జంక్షన్ నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. అటుగా వాహనాలు రాకుండా పోలీసు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.