విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం జగదంబ జంక్షన్ నుంచి గ్రీన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన లాంతరు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.