విశాఖ వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా భాద్యతలు చేపట్టిన ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో ప్రారంభించిన ప్రజాదర్బార్‌కి విశేష ఆదరణ లభించింది. భాదితులు సోమవారం కార్యాలయానికి వచ్చి వినతులు అందజేశారు. 13 అర్జీలు స్వీకరించినట్టు ప్రణవ్ గోపాల్ తెలిపారు. భాదితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.